బాలికల సాధికారతపై అవగాహన కార్యక్రమం

ముప్కాల్, నవంబర్ 05 ( లోకంతీరు ) : బాలికల సాధికారత (గుడ్ టచ్, బ్యాడ్ టచ్) అనే అంశాలపై ముప్కాల్ కేజీబీవీ పాఠశాలలో 8,9,10 తరగతుల విద్యార్థినిలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్సై సురేష్, మహిళా కానిస్టేబుల్ రమణి, పాఠశాల ఎస్వో వినోద, పోలీసు సిబ్బంది, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు..