Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ బస్సుల సర్వీసులను,సిబ్బందిని పెంచాలి…

0 1,278

ఆర్టీసీ బస్సుల సర్వీసులను,సిబ్బందిని పెంచాలి 

– పి.ఒ.డబ్ల్యూ, పి.డి.ఎస్.యు, పి.వై.యల్ డిమాండ్ 

నిజామాబాద్, సెప్టెంబర్ 11 ( లోకంతీరు ) : ఆర్టీసీ బస్సుల సర్వీసు లను పెంచాలని పనిచేసే సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళ,విద్యార్థి,యువజన సంఘాల ( పి.ఒ.డబ్ల్యూ, పి.డి.ఎస్.యు, పి.వై.యల్) ఆధ్వర్యంలో నిజామాబాద్ డిపో మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు.) జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సంధ్యారాణి మాట్లాడుతూ, తాడెం,మోపాల్,కులాస్పూర్,కంజర,ముల్లంగి,ఘన్పూర్,డిచ్పల్లి బస్టాండ్ వరకు బస్సుల సౌకర్యం సర్వీస్ లను పెంచాలని కోరారు. సిర్పూర్ ముదకపల్లి బార్సి సింగంపల్లి గ్రామంలో బస్సు సౌకర్యం పెంచి సర్వీసులను పెంచి విద్యార్థులకు, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనేక గ్రామాలకు గతంలో కంటే ఇప్పుడు బస్సు సర్వీసులు తగ్గినాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కేటాయించడం బాగుంది. కానీ ప్రయాణికుల సంఖ్యకు తగిన విధంగా, ముఖ్యంగా మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణం చేయడానికి బస్సు సర్వీసులు లేకపోవడం బాధాకరమన్నారు. బస్సులు సరిపోక ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. పల్లె వెలుగు బస్సుల ప్రతి గ్రామానికి సర్వీసులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో సిబ్బంది కూడా నియమించాల్సిందిగా డిమాండ్ చేశారు. వెంటనే బస్సుల సౌకర్యాలు, సర్వీస్ లను,సిబ్బందిని పెంచి విద్యార్థులకు ప్రయాణికులకు ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గౌర, పి.డి.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పి.వై.ఎల్. యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, మహిళా సంఘం నాయకులు లలిత, సువర్ణ,భాగ్య, భూలక్ష్మి,లావణ్య,నాగమణి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.