Take a fresh look at your lifestyle.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల వాటా ఇవ్వాలి:ఐఎఫ్టీయు.

0 2

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల వాటా ఇవ్వాలి.

కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు ఐఎఫ్‌టీయూ వినతి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మందమర్రి, అక్టోబర్ 7:

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ లాభాల్లో 10 శాతం వాటా కేటాయించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌సీసీడబ్ల్యుయూ–ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను యాజమాన్యం ఇప్పటివరకు ప్రకటించలేదన్నారు. తక్షణమే లాభాలను ప్రకటించి, కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు గనుల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, లాభాల వాటా విషయంలో వారికి అన్యాయం జరుగుతోందన్నారు. గతేడాది సింగరేణి లాభాల్లో పర్మనెంట్ కార్మికులకు 34 శాతం వాటా చెల్లించారని, సంస్థకు లాభాలు సమకూరడంలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా కీలకమన్నారు. తక్కువ వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో వారి శ్రమను గుర్తించి లాభాల్లో 10 శాతం వాటా కేటాయించేలా మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీసీడబ్ల్యుయూ–ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న, బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు టి.శ్రీనివాస్, రీజియన్ నాయకులు గోషిక లింగన్న, భూమయ్య, కనకయ్య, గణేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.