Take a fresh look at your lifestyle.

కొత్తగూడెంలోని లోతువాగు అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, నూతన దుస్తుల పంపిణీ.

0 11

అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, నూతన దుస్తుల పంపిణీ.
‘అమ్మ మాట – అంగన్‌వాడి బాట’ కార్యక్రమం నిర్వహణ.
చిన్నారులకు విద్యా ప్రోత్సాహం, నూతన వస్త్రాల అందజేత.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 20:‘అమ్మ మాట-అంగన్‌వాడి బాట’ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు అంగన్‌వాడీ కేంద్రం (లక్ష్మీదేవిపల్లి సెంటర్-3)లో శనివారం అక్షరాభ్యాసం, నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఈసం కళ్యాణి, ఉపసర్పంచ్ ఎస్‌కే యాకూబ్ పాషా చేతుల మీదుగా ప్రారంభించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, నూతన దుస్తులను పంపిణీ చేశారు. విద్యాభ్యాసానికి తొలి అడుగు వేస్తున్న చిన్నారులను వారు అభినందిస్తూ, చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్ తాటి సరోజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ భద్రాద్రి జిల్లా కోఆర్డినేటర్ ఎల్. జ్యోతిరాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, ఎస్‌జీఎఫ్ ఉమెన్స్ గిల్డ్ జాయింట్ సెక్రటరీ కళ్యాణి, కళావతి, అంగన్‌వాడీ టీచర్లు అంజలి, సుజాత, ఆయా జాలాది మణెమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లల విద్యా, పోషకాహార అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.