Take a fresh look at your lifestyle.

బాల్కొండ లొ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన…ముత్యాల సునీల్ కుమార్

0 1,315

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన

  • బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ, ఫిబ్రవరి 22 ( లోకం తీరు ) :  బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులను కలసి సమస్యలను తెలుసుకున్నారు, ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి కావాల్సిన సౌకర్యాలు మరియు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ కండిషన్ తెలుసుకొని ఆసుపత్రిలో చేయవలసిన పనులను గమనించారు.

నూతనంగా వచ్చిన స్టాఫ్ నర్స్ లను అభినందించి రోగులకు సేవలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

ఆసుపత్రి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.