Take a fresh look at your lifestyle.

ధన్వాడ ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా : చల్ల నారాయణరెడ్డి.

0 24

ధన్వాడ ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా.                                                                               బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల నారాయణరెడ్డి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

కాటారం, జూలై 6: జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల నారాయణరెడ్డి, సుజాత దంపతులు  సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని చల్ల నారాయణరెడ్డి ప్రకటించారు. ఆయన ఇచ్చిన హామీపై గౌడ కులస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన నారాయణరెడ్డి దంపతులను గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, గౌడ కులస్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.