కేఎల్ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ‘శిక్షా రత్న-2026’ పురస్కారం.
అకడమిక్ ఎక్సలెన్స్ విభాగంలో ఎ. నరసింహారావుకు ప్రతిష్ఠాత్మక అవార్డు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, సెప్టెంబర్ 7: కేఎల్ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ. నరసింహారావుకు అకడమిక్ ఎక్సలెన్స్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ‘శిక్షా రత్న-2026’ పురస్కారం లభించింది. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేస్తున్న కృషి, విద్యాసంస్థల అభివృద్ధిలో చూపుతున్న నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హరి విశ్వవిద్యాలయం, సూపర్ ఏఐ అకాడమీ, అదాబ్ హైదరాబాద్, సాక్షి ఎడ్యుకేషన్, స్టడీ9 మీడియా సంయుక్త ఆధ్వర్యంలో పురస్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డా. వి. బాలకృష్ణరెడ్డి, ఐసీఏఆర్-ఏఐసీఆర్పీ డైరెక్టర్ డా. తారా సత్యవతి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ యాజమాన్యం, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఎ. నరసింహారావును అభినందించారు. విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు ‘శిక్షా రత్న-2026’ పురస్కారం గౌరవప్రదమైన గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.
Next Post