Take a fresh look at your lifestyle.

కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయి….

0 1,371

కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయి.

కోటగిరి/బాన్సువాడ, మార్చి 13 ( లోకంతీరు ) : కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీ కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని బీసీ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.బుధవారం కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి వారు క్షీరాభిషేకం నిర్వహించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 బీసీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ క్యాబినెట్లో తీర్మానించడం పై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు, వీరశైవ లింగాయత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల తరుపున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామని అన్నారు.ముది రాజ్,యాదవ,కురుమ,మున్నూరు కాపు,పద్మశాలి,పెరిక,లింగాయత్, మేరు,గంగాపుత్ర,ఆర్యవైశ్య,ఏకలవ్య 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు.రాబోయే రోజుల్లో బీసీ కులాల ఐక్యతతో పాటు అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవు తుందన్నారు.గత ప్రభుత్వాలు బీసీ కులాలను రాజకీయంగా ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని కానీ రేవంత్ రెడ్డి కాపులను ఇతర బీసీ కులాలను అభివృద్ధి చేసేందు కు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.బీసీ కులాలు రాబోయే రోజుల్లో ఆర్థికంగా,సామాజికంగా,విద్యా రంగం ఇతర అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తు న్నామని తెలిపారు.ఈ కార్పొరేషన్ల ఏర్పాటు అభివృద్ధికి చిహ్నం అన్నారు.గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంఘం నాయకులు గంగాధర్ దేశాయ్, రాజేశ్వర్ పటేల్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టం మనోహర్, వల్లెపల్లి శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తెల్ల రవికుమార్, మోత్ పేట రాజయ్య,మక్కయ్య, కూచి శ్రీనివాస్,బర్ల మధు,తెల్ల చిన్న అరవింద్,గర్దాస్ ఆనంద్,పెద్ద కాపు శ్రీకాంత్,కూచి సాయి బాబా, ఎడ్డెడి శంకర్,ఎడ్డేడి గంగారం, కాంగ్రెస్ నాయకులు సలీం, అయూబ్,అనంత విఠల్,జలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.