సింగరేణిలో 11 లా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
అంతర్గత అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 3 చివరి తేదీ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, అక్టోబర్ 22: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 11 లా అసిస్టెంట్ (టి అండ్ ఎస్ గ్రేడ్-బి) పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం గురువారం సర్క్యులర్ జారీ చేసింది. అర్హులైన అంతర్గత అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎల్ లేదా ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారు అర్హులు. అంతర్గత అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన లేదని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి నవంబర్ 3 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులను విభాగాధిపతుల ద్వారా సమర్పించాలి. యూనిట్ స్థాయిలో హార్డ్ కాపీల స్వీకరణకు నవంబర్ 5 సాయంత్రం 5 గంటలు చివరి తేదీ కాగా, కార్పొరేట్ కార్యాలయానికి దరఖాస్తులు చేరాల్సిన గడువు నవంబర్ 14 సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, అసెస్మెంట్ రిపోర్టు ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షను 85 మార్కులకు ఇంగ్లీష్‌లో బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. అభ్యర్థుల సర్వీస్, హాజరు, ప్రవర్తన ఆధారంగా అసెస్మెంట్ రిపోర్టుకు 15 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.