రేపు రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటన
అధికారులకు జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాలు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఆసిఫాబాద్, మే 27:ఈనెల 29న రాష్ట్ర గవర్నర్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.35 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్‌కు చేరుకునే గవర్నర్, ఉదయం 11 గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని రౌట్ సంకేపల్లి గ్రామానికి చేరుకుని “జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం–2026” కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రక్షణ చర్యల కోసం కేటాయించిన అధికారులు, సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.రవాణా శాఖ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టాలని, గవర్నర్ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.