Take a fresh look at your lifestyle.

జిల్లాలోని ఓటర్ల తుది జాబితా విడుదల….

0 1,789

జిల్లాలోని ఓటర్ల తుది జాబితా విడుదల

– కలెక్టర్ జితేష్ పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7 ( లోకం తీరు ) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెకండ్ సమ్మరి రివిజన్-2024 లో భాగంగా జనవరి 1, 2024 నాటికి అర్హత కలిగిన ఓటర్లతో కలిసి రూపొందించిన ఓటరు తుది జాబితాను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం విడుదల చేశారు. ఇట్టి తుది జాబితా మేరకు జిల్లాలో 6,77,936 మంది ఓటర్లతో పాటు 27 మంది యెన్.ఆర్.ఐ. ఓటర్లు, మరో 558 మంది సర్వీస్ ఓటర్లున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందులో పురుషు ఓటర్లు 3,27,724 మంది , మహిళలు 3,50,181 మంది కాగా మరో 31 మంది ఇతరులున్నారని అన్నారు. కాగా జుక్కల్ నియోజక వర్గంలో 2,01,935 మంది, యెల్లారెడ్డి నియోజక వర్గంలో 2,21,730 మంది కామారెడ్డి నియోజక వర్గంలో 2,54,271 మంది ఓటరులున్నారని అన్నారు. ఇట్టి తుది ఓటరు జాబితాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు అందజేయడంతో పాటు తహసీల్ధారు కార్యాలయాలు, కలెక్టరేట్ లో నోటీసు బోర్డుపై ప్రదర్శించామని కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.