Take a fresh look at your lifestyle.

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన…….

0 896

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన

– డి ఆర్ పి రమేష్ కుమార్

కామారెడ్డి జిల్లా /సదాశివ నగర్, ఆగస్టు 23 (లోకంతీరు) : జిల్లాలోని సదాశివ నగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ యొక్క కాంప్లెక్స్ లో మహిళా సమైక్య ఆధ్వర్యంలో హోటల్ ను ఏర్పాటు చేస్తున్నామని డిఆర్ పి రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఏపిఎం రాజిరెడ్డి తో కలిసి పరిశీలించారు. అక్కడే ఉన్న ఉమ్మడి మండల మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు, స్థానిక సింగిల్ విండో చైర్మన్ కమలాకర్ రావు, మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకుడు కోతి లింగారెడ్డి, మండల బీసీ నాయకుడు కలాలి సాయ గౌడ్ తో కలిసి పరిశీలించారు. ఇటీవలే మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు జిల్లా అధికారులను కలిసినప్పుడు భవనం వృధాగా ఉందని దాన్ని వినియోగంలో తేవాలని కోరినట్లుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఏది ఏమైనా మండల ఐకెపి ద్వారా మహిళలకు వ్యాపారం ఏర్పాటు చేసుకునే వీలుగా భవనాన్ని ఎంపిక చేయడం పట్ల జిల్లా యంత్రాంగానికి ఐకెపి అధికారులకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం నాయకురాలు దోకురి శోభ, సీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.