శ్రీ సీతారామచంద్ర రాజరాజేశ్వర ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు
- మారు మోగిన రామ నామం..
- పులకించిపోయి పరవశించిన జనం.
-
![]()
రామారెడ్డి , జనవరి 22 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ని శ్రీ సీతారామచంద్ర రాజరాజేశ్వర ఉభయ ఆలయాలలో సోమవారం భక్తజనం అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా విగ్రహ ప్రతిష్టకు భక్తులు భారీ సంఖ్యలో శ్రీ సీతారామచంద్రస్వామి మూలవిరాట్ , ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు,
భజన కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు మహా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాలయ ఉత్సవ కమిటీ,బాజరంగ్ దళ్,విశ్వ హిందు పరిషత్, స్వాధ్యాయ పరివారము, వివిధ భక్త జన బృందాల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులకు లైవ్ టెలికాస్ట్ ద్వారా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేశారు.
