Take a fresh look at your lifestyle.

గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇంటింటాసర్వే నిర్వహించాలి….

0 1,190

గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇంటింటాసర్వే నిర్వహించాలి

ఎడపల్లి , నవంబర్ 02  ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో. ప్రతి ఇంటింటా. పగడ్బందీగా. సర్వే నిర్వహించాలని.ఎంపీడీవో శంకర్ నాయక్.గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ బీఎల్ఓ లు, ఇంటింటి సర్వేను పగడబందిగా నిర్వహించాలని ఎడపల్లి ఎంపీలు శంకర్ నాయక్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన గ్రామ పంచాయతీ కార్యదర్శి తో పటు, గ్రామపంచాయతీ బి ఎల్ ఓ, అలాగే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు,. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల ఆరో తారీకు నుండి పక్షం రోజులపాటు, గ్రామ క్షేత్రస్థాయిలో ఇంటింటా సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని ఆయన గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. టీం వర్క్ అనేది చాలా ముఖ్యమైనది అన్నారు. ఇందులో పంచాయతీ కార్యదర్శులతోపాటూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు బీఆర్ఓలు పాల్గొనాలని ఆయన అన్నారు. సర్వే నిర్వహించి సమయంలో ఆ గ్రామంలో ఒకరోజు ముందుగానే దండోరా వేయించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటిని సర్వే చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత నివేదికలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎంపీ ఓ మన్మోహన్ శాస్త్రి, కంప్యూటర్ ఆపరేటర్ సుమలత, గ్రామపంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఎరుపల్లి మండల అధ్యక్షులు ఉదయ భాస్కర్, కార్యదర్శులు రామిరెడ్డి, గంగాధర్ ,పద్మావతి సురేష్, సాయికుమార్ ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్)).. ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో శంకర్ నాయక్.

Leave A Reply

Your email address will not be published.