ఉప్లూర్ లో అన్న వితరణ కార్యక్రమం

కమ్మర్పల్లి, జనవరి 25 ( లోకం తీరు ) : కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో గురువారం పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక శ్రీ షిరిడి సాయి బాబా ఆలయం వద్ద భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబా ఉత్సవ విగ్రహంతో సాయి భక్తులు ఆలయం చుట్టూ ఊరేగింపుతో పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నందగిరి దయానంద్, పోలేపల్లి లచ్చయ్య, బద్దం గంగారెడ్డి, ఎనుగందుల శశిధర్, పసుపుల రాజేందర్, పెంబర్తి నరేష్ కుమార్, పోతు మురళి, మాసం రాజేశ్వర్ గౌడ్ , పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.