Take a fresh look at your lifestyle.

ఐ యఫ్ టి యు  క్యాలెండర్ ఆవిష్కరణ

0 1,251

ఐ యఫ్ టి యు  క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్, జనవరి 25 ( లోకం తీరు ) : భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లి వద్ద క్యాలెండర్ స్టిక్కర్ల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా IFTU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కనీస వేతనాల 5 జీవోల గెజిట్ చేయాలనీ, మిగతా 68 షెడ్యూల్డ్ జీవోలు పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు సవరించాలన్నారు. ఆటో, మోటార్, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. యూనివర్సిటీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల నాన్ టీచింగ్, వర్కర్లకు, మున్సిపల్, గ్రామ పంచాయితీ, మిషన్ భగీరథ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

 ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో IFTU జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న జిల్లా సహాయ కార్యదర్శి బి. మల్లేశ్, జిల్లా నాయకులు డి.కిషన్, బి.మురళి సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.