మద్యం మత్తు లో కిందపడి ఒకరు మృతి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 21( లోకంతీరు) : బాల్కొండ పోలీస్ స్టెషన్ పరిధిలో మద్యం మత్తులో కిందపడి నాగపూర్ గ్రామానికి చెందిన బాల్కొండ సొసైటీ డైరెక్టర్ గుర్కడి లింబాద్రి (50) మృతి చెందినట్లు బాల్కొండ ఎస్సై నరేష్ తెలిపారు. బాల్కొండ ఎస్సై నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సహా డైరెక్టర్లు బాల్కొండ శివారులోని ఓ ఫామ్ హౌస్ వద్ద పార్టీ చేసుకుని ఇంటికి వెళ్లేందుకు బైక్ వద్దకు వెళ్తున్న సమయంలో తూలుతూ కిందపడగా తలపై బైక్ పడి కంటికి బలమైన గాయంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుని భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.