Take a fresh look at your lifestyle.

సిపిఐ బహిరంగసభను జయప్రదం చేయాలి…

0 1,170

సిపిఐ బహిరంగసభను జయప్రదం చేయాలి

  • సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర

 

బాన్సువాడ/కోటగిరి, జనవరి 28 ( లోకం తీరు ) : ఫిబ్రవరి 4న హైదరా బాదులో జరిగే సిపిఐ పార్టీ భారీ బహిరంగ సభను పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ నిజాంబాద్ జిల్లా కార్యదర్శి సుధాకర్ పిలుపు నిచ్చారు.ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.ఫిబ్రవరి 2, 3,4 తేదీలలో హైదరాబాద్ మగ్దూం భవన్లో సిపిఐ జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నా యని ఈ సమితి సమావేశా లకు సిపిఐ ఆయా రాష్ట్రాల్లో ఉన్న జాతీయ నాయకులతో పాటు సిపిఐ పార్టీ మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు రానున్నా రని ఈ సమావేశాలలో భవిష్యత్తులో జరగనున్న పార్ల మెంట్ ఎన్నికలతో పాటు దేశంలో బిజెపి నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించడం జరుగుతుందని అన్నారు.చివరి రోజున ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభ కలదని ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయ వంతం చేయాలని కోరుతున్నా మన్నారు.ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ బాన్సువాడ నియోజక వర్గ ఇన్చార్జ్ దుబాస్.రాములు, సిపిఐ మండల కార్యదర్శి ఏ. విటల్ గౌడ్,సిపిఐ మండల నాయకులు బర్ల సునీల్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.