ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
. సమరయోధుల త్యాగ ఫలం..
. నేటి గణతంత్ర సంబరం..
. దేశభక్తిని రగిలించే రిపబ్లిక్

బాల్కొండ, జనవరి 26 (లోకం తీరు ) : బాల్కొండ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా సీఐ గొవర్ధన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ.. సెల్యూట్ చేసే రోజు కూడా ఇదే . అమర వీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ.. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ.. సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం అని సీఐ గొవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎస్సై కే గోపి పాటు ఏఎస్సై శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.