పట్టుబడిన పిడిఎస్ బియ్యనికి వేలంపాట.

బాన్సువాడ కోటగిరి, ఫిబ్రవరి 13 ( లోకంతీరు ) :- నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 న కోటగిరి తాహాసిల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గం.లకు పిడిఎస్ బియ్యానికి వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్వో ఒక ప్రకటనలో తెలిపారు.కరం ఇండస్ట్రీ, బాలాజీ ట్రేడర్స్ కోటగిరి నందు నిల్వ ఉంచిన 51.50 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యానికి వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ.5 వేలు దరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు.ఈ వేలం పాటలో అధిక ధర పలికిన వారు ఏక మొత్తంలో పైకము చెల్లించి తదుపరి పైకం విషయంలో పూర్తిగా చెల్లించి అధికారుల అనుమతితో బియ్యాన్ని స్వాధీన పరుచు కోవాలన్నారు.