నీలకంఠేశ్వరుని రథయాత్ర ప్రారంభోత్సవంలో
– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ , ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : ఇందూర్ నగరంలో కంఠేశ్వర ఆలయంలో నిర్వహించిన రథోత్సవం కార్యక్రమానికి ముఖ్యతిథిగా పాల్గొన్న ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కు ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ, భక్తులతో కలిసి రథనికి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతు మఘ శుద్ధ సప్తమి రోజున ఆ సూర్యభాగవానుడు ఆవిర్భావించిన రోజు సందర్బంగా ప్రజలందరు రథసప్తమి జరుపుకోవడం జరుగుతుందని, కొన్ని దశాబ్దాల చరిత్ర గల నీలకంఠేశ్వరుని ఆలయంలొ ప్రతి సంవత్సరం రథయాత్ర అనవాయితీగా జరుగుతుందని, ఆ సూర్యభాగవానుని మరియు పరమేశ్వరుని కరుణాకటాక్షాలు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి అని ఆ ముక్కంటి పరమేశ్వరున్ని వేడుకోవడం జరిగిందని అన్నారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించే ఆలయ కమిటీకి & దేవదాయ శాఖకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలొ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, మాస్టార్ శంకర్, మమత-ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్,బిజెపి నాయకులు పవన్, ఆనంద్, పవన్ ముందడ, భాస్కర్, రాకేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

