సంత్ సేవాలాల్ లంబాడీల కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మార్చ్ 15 ( లోకంతీరు ) : లంబాడీలకు సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయునట్లు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి హర్షిస్తూ శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎల్లారెడ్డి మండల కేంద్రంలో వివిధ తండాల గిరిజన నాయకులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాదిక అన్ని రంగాల్లో వెనుకబడిన లంబాడీలను గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విస్మరించి కాలగర్భంలో కలిసిపోయాయని వారు అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 90 రోజులనే సంత్ సేవాలాల్ లంబాడీల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. అన్ని కులాలకు ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్, గణేష్, నాగేష్, కైలాస్, మైపాల్, సుధాకర్, వసంత్, ప్రకాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.