Take a fresh look at your lifestyle.

సిఏఏ హర్షణీయం..బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి

0 1,475

సిఏఏ హర్షణీయం..

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్.

ఆర్ముర్ , మార్చ్ 12 ( లోకంతీరు ) : కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజు పౌరసత్వ సవరణ చట్టం (సి ఏ ఏ) ను అమలు పరుస్తూ అధికార పత్రం గెజిట్ ను విడుదల చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ… 

భారతీయ పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) 2016 జూలైలో పార్లమెంటు లో ప్రవేశపెట్టడం పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం కాగానే ఈశాన్య భారతదేశంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరగడంతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందలేకపోయిందని. కానీ 2019 డిసెంబర్ 11న మళ్లీ ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం చేసుకోవడం జరిగిందని. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఈ బిల్లు ఈ దేశంలోకి డిసెంబర్ 31,2014 కన్నా ముందు అంటే దాదాపు 66 నుంచి 67 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు తదితర మైనార్టీ వర్గాలు మెజార్టీ వర్గం అయినటువంటి ముస్లిం మతోన్మాదులచే మత పరమైనటువంటి హింసను భరించి అక్కడ ఉండలేక భారతదేశానికి వలస వచ్చి ఉంటున్నటువంటి ఆ మైనార్టీలను భారతదేశం పౌరసత్వ సవరణ చట్టం కింద వారికి భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతా ఉందని. అంతేకానీ ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదని. అలా అనుకుంటే ఎప్పుడైతే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఈ దేశంలో భారత ప్రధానిగా ఇందిరా గాంధీ ఉండి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనార్టీలైన హిందువులను భారతదేశంలో వచ్చి ఉండవలసిందిగా కోరడమైనదని. మరి ఆ రోజు కూడా ఇందిరాగాంధీ ముస్లింలను రమ్మని చెప్పలేదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు , మిగతా పార్టీల వారు గ్రహించాలన్నారు. ఆయా దేశాల్లో మెజార్టీగా ఉన్నటువంటి వ్యక్తులు మత పరమైనటువంటి ఇబ్బందులకు గురికారని, ఎవరైతే మతపరమైనటువంటి ఇబ్బందులను గురయ్యారో వారు మైనార్టీలే కాబట్టి ఆ మైనార్టీలు మాత్రమే ఈ దేశంలో వచ్చి ఉండడంతో వారికి భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందని. కాబట్టి ఈ యొక్క భారత పౌరసత్వ సవరణ చట్టం 2019లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందినప్పుడు గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కూడా ఉండి ఈ యొక్క తీర్మానాన్ని బలపరచడం జరిగిందని వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని. 

అదేవిధంగా ఈ దేశంలో మయన్మార్ నుండి వచ్చినటువంటి ముస్లిమ్స్ రోహింగ్యాలు కానివ్వండి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలను ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పక్షాలు వారిని ఓటు బ్యాంకు గా ఉపయోగించుకొని వారి పబ్బం గడుపుతా ఉన్నారని. ఇది ఎంతవరకు సమంజసమని ఇది భారతదేశానికి ప్రమాదకరమని తెలియజేస్తూ. ఈ యొక్క రాష్ట్రంలో సైతం పౌరసత్వ సవరణ చట్టం వెంటనే అమలులోకి తేవాల్సిన అవసరం ఉందని. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించవలసిన అవసరం ఉందని. ఒకవేళ ఈ దేశంలోని ఏ రాష్ట్రమైన ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయదో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని. కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఉండాలి అనుకుంటే మరోసారి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని బలపరచవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. 

ఈ సమావేశంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్, పల్లె శ్రీనివాస్ బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, మరియు ఆముదాల విజయ్, గోపాల్ యాదవ్, ప్రవీణ్,సవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.