మైనార్టీ సంక్షేమ శాఖ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చ్ 16 ( లోకంతీరు ) : తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ శిక్షణ కేంద్రంలో యూపీఎస్సీ సీశాట్ 2024-25 సంవత్సరానికి ఉచిత శిక్షణ ఇవ్వనుందని, ఈ మేరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ శుక్రవారం ఒక్ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్సి సీశాట్ శిక్షణకు (100) మంది డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైను, బుద్ధిష్ట్ & పార్శీ) అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నదని, రిజర్వేషన్ల ప్రకారం మహిళా అభ్యర్ధులకు 33.33% శాతం సీట్లు, అన్ని రిజర్వ్ కేటగిరిలో వికలాంగులకు 3% సీట్లు కేటాయించనైనదని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఇతర విద్యాసంస్థల్లో ఏ రకమైన కోర్సు, ఉద్యోగం చేయకుండ, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉండరాదని, (www.tmreistelangana.cgg.gov.in) వెబ్ సైట్ నందు ఏప్రిల్ 12
వరకు దరఖాస్తు చేసుకావాలని ఆయన సూచించారుమైనారిటీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు నిర్వహించ వలసిన స్క్రీనింగ్ టెస్ట్ తేది: 28.04.2024 (ఆదివారం)న ఉ. 10.30 గం. నుండి మ.12.30 ల వరకు తెలంగాణ మైనారిటి గురుకుల బాలుర పాఠశాల కామారెడ్డి నందు నిర్వహించబడునని ఆయన పేర్కొన్నారు.