Take a fresh look at your lifestyle.

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…..

0 1,446

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 13  ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పొందుర్తి చెక్ పోస్ట్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాదు వైపు నుండి కామారెడ్డి వైపు వస్తున్న ఏర్టిగా టిఎస్ 12 ఈఎం 9595 కారును వెనక నుండి ఒక్కసారిగా లారీ ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది, కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.