కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన
– తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు

ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారి ఆదేశాల మేరక నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండల కేంద్రంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కొండ లక్ష్మణ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అబ్బ గోని అశోక్ గౌడ్, దాసరి మూర్తి, అన్నగారు గౌడ్, భీమనపల్లి విఠొబా తెలియజేశారు.
అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ బాబూజీ క్విట్ ఇండియా ఉద్యమం తో పాటు రజాకా ఉద్యమంలో మరియు నిజాం లకు కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మరియు స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా నిలబడినారని అబ్బ గోని అశోక్ గౌడ్ తెలియజేశారు.
అదేవిధంగా కామారెడ్డి రిజర్వేషన్ లో భాగంగా 42% స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ప్రకటించకపోవడం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నామని తెలియజేశారు. వెంటనే కులగణను జరిపించాలని దానితోపాటు డిక్లరేషన్ ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆమర దీక్ష చేపడతామని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అన్న గౌడ్ నారా గౌడ్ మాట్లాడుతూ..
కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట యోధుడని తెలియజేశారు. ఆయనను బీసీలు ఎల్లవేళలా స్మరించుకోవాలని అన్న గౌడ్ నారా గౌడ్ తెలియజేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఈడబ్ల్యూ ఎస్ మెడికల్ సీట్లలో భాగంగా ప్రకటించాలని కోర్టులో పిటిషన్ దావా వేయడం సిగ్గుచేటని అన్న గౌడ్ నారా గౌడ్ తెలిపారు. బీసీల ఓట్లతోనే వెంకట్రామిరెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆయన గుర్తుంచుకోవాలని వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని తెలియజేశారు. నడవాలని తెలియపరచారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమం తో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోల్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని తెలియజేశారు. అనేక మంత్రి పదవులు చేపట్టి బీసీలకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డారని ఆయనని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని తెలియజేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షు భీమనపల్లి విడ్డోబా మాట్లాడుతూ మండల కమిషన్ ను ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ వ్యతిరేకించినందుకు
కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవులు రాజీనామా చేయడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దాసరి మూర్తి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శాల మేరకు యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని తెలియజేశారు. కులగననే వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపుతుందని. కేవలం అగ్రవర్ణాలకి రాజకీయ పదవులను అంటగడుతుందని ఈడబ్ల్యూఎస్ ని వెంటనే రద్దు చేయాలని దాసరి మూర్తి డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేక పార్టీలని దాసరి మూర్తి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.