ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ పార్టీ….
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు,
- ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్13 ( లోకంతీరు ) : జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో బిఎస్పీ పార్టీ, బీఆర్ ఎస్ పార్టీలకు చెందిన రాజులు సెట్ లొంగన్ మాజీ సర్పంచ్ సదు పటేల్ చిన్న ఏడ్గి మనోహర్ పటేల్ పడంపల్లి మాజీ సర్పంచ్ గంగాధర్ లాడేగావ్ యువ నాయకుడు ప్రకాష్ పటేల్ వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు యువకులు భారీ సంఖ్యలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, చేరికలు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త చేరికల వల్ల నాయకులు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు కష్ట కాలంలో పార్టీ జెండా మోసి తన గెలుపు కోసం కష్ట పడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అందరికీ తన వంతు ప్రాదాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు, మరి కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు.