Take a fresh look at your lifestyle.

రెండు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆకస్మిక తనిఖీ….

0 1,517

రెండు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆకస్మిక తనిఖీ

-జిల్లా విద్యాశాఖ అధికారి రాజు

కామారెడ్డి జిల్లా దోమకొండ , మార్చి 13  ( లోకంతీరు ) : దోమకొండ మండలంలోని లింగుపల్లి ముత్యంపేట్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజు , అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణు శర్మలు కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యాశాఖ అధికారి , అకాడమిక్ మానిటరింగ్ అధికారులు లింగుపల్లిలోని ప్రాథమిక పాఠశాలను ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు. పాఠశాలకు సంబంధిత రికార్డులను అధికారులు తనిఖీ చేసి విద్యార్థుల నోట్స్ లను పరిశీలించారు. ఎప్పటికప్పుడు విద్యార్థులు నోట్స్ను కరెక్షన్ చేయాలని ఈ సందర్భంగా అధికారులు పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు . ముఖ్యంగా పై అధికారుల ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలలకు గైర్హాజరు కావద్దని సూచించారు. అదేవిధంగా మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అధికారులు తనిఖీ చేసి ఉపాధ్యాయ బృందానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.