Take a fresh look at your lifestyle.

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు….

0 1,514

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు….

  • అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు

  • జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

భీంగల్ , ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా భీంగల్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు సామాన న్యాయం లభించాలని ఆలోచనతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని, కానీ ప్రస్తుతం దేశంలోని కొన్ని దుష్టశక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, దానిని ఎదిరించాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజల పైన ఉందని ఆయన తెలిపారు. అంబేద్కర్ కొందరివాడు అని ముద్రవేస్తూ ఆయన ఆశయాలను ఆలోచనలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న వారిని ఎదుర్కోవాలని, అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో భీంగల్ మండల కమిటీ అధ్యక్షులు బోదిరే స్వామి,టౌన్ కాంగ్రెస్ అద్యక్షులు జేజే నర్సయ్య,స్వామి జిల్లా ఎన్ఎస్యుఈ అధ్యక్షులు వేణు రాజ్,ఎస్సీ సెల్ మండల అద్యక్షులు అనంత రావు,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వక మహేష్,సుంకరి సురేష్,అనిల్ గౌడ్,నల్లూరి శ్రీను,కృష్ణ,రాజు,నిఖిల్ రెడ్డి,విక్రమ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.