Take a fresh look at your lifestyle.

కులగణన చేసిన మంత్రి వర్గం….

0 1,465

కులగణన చేసిన మంత్రి వర్గం కు..కృతజ్ఞతలు..

  • జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు..

నిజామాబాద్ ,  ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, కుల గణన కోసం రాష్ట్ర శాసన సభలో శుక్రవారం తీర్మానం ప్రవేశ పెట్టడం హర్షణీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు ప్రకటనలో పేర్కొన్నారు. కుల గణనతో బీసీల జనాభా లెక్కలు తెలనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు తీసేందుకు, ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయడం హర్షణీయమని పొగిడారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో పేర్కొనడాన్ని అహ్వనిస్తున్నామన్నారు. కుల గణన తీర్మానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి మండలి, ఎమ్మేల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.