ముప్కల్ లో స్పెషల్ డ్రైవ్ చేసిన పోలీసులు
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 07 ( లోకంతీరు ) : ముప్కల్: మండల కేంద్రంలో బుధవారం రోజు సాయంత్రం అకస్మికంగా స్పెషల్ డ్రైవ్ ని ఆర్టీవో పోలీసులు చేపట్టారు. మండల కేంద్రంలో వచ్చినటువంటి బైకులు నంబర్ ప్లేట్ లేకున్నా, హెల్మెట్ లేకుండా, బండి కాగితాలు సరిగా లేకున్నా ఆపడం జరిగింది. ఇందులో ఆర్టీవో వివేకానంద రెడ్డి గ్రామ ప్రజలకు , వాహనదారులకు రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో వివేకానంద రెడ్డి, ట్రాఫిక్ సిఐ రమేష్ , స్థానిక ఎస్సై భాస్కరాచారి, పోలీస్ కానిస్టేబుళ్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ముప్కల్ లో స్పెషల్ డ్రైవ్ చేసిన పోలీసులు