పోషకాల రేషన్ పక్కా పరేషాన్..?
పక్కదారి పడుతున్న రేషన్ బియం
-
ఇంటి దొంగనైనా ఈశ్వరుడు పట్టలేడు నానుడి..?
-
మరో ఎక్కడ బియ్యం అమ్మకండి మేమే కొంటాం..?
-
ఆ మండలంలో జరుగుతున్న తతంగం
-
చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సివిల్ సప్లై..?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా మండల పరిధిలోని ఆయా గ్రామాలలో
బడుగు బలహీనవర్గాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేద ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందించాలని సదుద్దేశంతో బలహీన వర్గాల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రీసైక్లింగ్‌తో కొందరు మిల్లర్లు కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో కాసులు కురిపిస్తున్న దందాను చూసి కొత్తగా రేషన్ డీలర్ లు పుట్టుకొస్తున్నారు.
కొత్తగా రేషన్ డీలర్ ల దందాలు..?
జిల్లాలో కాసులు కురిపిస్తున్న దందాను చూసి కొత్తగా రేషన్ డీలర్లు ఆశకు హద్దులు లేవు అన్నట్టు మాకేం తక్కువ అనే రీతిలో అవతారం ఎత్తారు.? కొత్తగా ఈమధ్య కొత్త తరహాలో పుట్టుకొస్తున్నరు . కొవిడ్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యాన్ని అందించిన సమయంలో నుండి బియ్యం రీసైక్లింగ్ జోరుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా బియ్యం కలిపి ఈ నెల వరకు ప్రతీ లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తోంది.
దొడ్డు రకం బియ్యంతో వచ్చిన తంటా…?
దొడ్డు రకం బియ్యం కావడంతో వాటిని అమ్మడానికి కొందరు లబ్ధిదారులు కూడా మొగ్గు చూపుతున్నారు.రేషన్ బియ్యం గ్రామాలు, పట్టణాల్లో కొనుగోలు చేయడానికి దళారులు పుట్టుకొచ్చారు.10 రూపాయలకు కొనుగోలు చేసి సుమారు 14 నుండి 16 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని టూ వీలర్ పైన గాని ఫోర్ వీలర్ పైన గాని కొనుగోలు చేసిన బియ్యాన్ని అరాస్యంగా తరలిస్తారు.
ఇదే అదునుగా రేషన్ డీలర్ల కోస మెరుపు..?
రేషన్ బియ్యం అమ్మడంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ డీలర్లు మాత్రం ఎలక్ట్రానిక్ బయోమెట్రిక్ విధానం అనుసరించి లబ్ధిదారుడు వేలిముద్రలతో సర్వర్ ను అనుసంధానం చేస్తారు. తర్వాతి ఎదురుగా ఉండే బ్లూటూత్ సంబంధిత తూకం కొలిచే పరికరానికి అనుసంధానం చేస్తారు. అక్కడే కుస మెరుపు మొదలవుతుంది. లబ్ధిదారులకు సివిల్ సప్లై సప్లై చేసే తట్టు గోనె సంచి ద్వారా బరువును జోకి బియ్యాన్ని పంపిణీ ఇలా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి సుమారు 250 నుండి 350 గ్రాముల బియ్యం వరకు మిగులు బాటు జరుగుతుంది. బ్లూటూత్ ఎలక్ట్రానిక్ పరికరం సరిగ్గానే వెయిట్ చేస్తుంది కానీ ఇలా మిగిలిన బియ్యాన్ని, వీటికి తోడు లబ్ధిదారుల నుండి సేకరించిన బియ్యం తో దగ్గరలో ఉండే, సమీపంలో ఉండే రైస్ మిల్లర్లకు గాని, అక్రమ పిడిఎస్ రీసైకిల్ డీలర్లకు అమ్మడంలో ఉత్తమెరుపు. మరోవైపు రేషన్ డీలర్లకే బియ్యాన్ని అందిస్తూ లబ్ధిదారులు నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాలో సేకరించిన పేదల బియ్యం, రైస్‌మిల్లర్లతో ఏర్పరచుకున్న ఒప్పందాల మేరకు మిల్లులకు తరలిస్తుండగా మరికొందరు జిల్లా కేంద్రంలోని బ్రోకర్లకు రహస్యంగా తరలిస్తారు. వాటిని బ్రోకర్లు పౌల్ట్రీ పరిశ్రమలకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రేషన్ లబ్ధిదారుల నుంచి రూ.10 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేసి వాటిని రీసైక్లింగ్ తో అమ్మి దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
రీసైక్లింగ్ పేరుతో మిల్లర్ ల చేతి వాటం..?
మిల్లర్లకు ప్రభుత్వం కిలో రూ 24 నుండి 28 రూపాయల వరకు చెల్లిస్తోంది. దీంతో మిల్లర్లు ఎక్కువగా రీసైక్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని కొందరు మిల్లర్లు దళారులను ప్రోత్సహిస్తున్నా
రనే విమర్శలు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు తరచూ బియ్యం పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి ? ప్రతీ సంవత్సరం వేల క్వింటాళ్లలో అక్రమ దందా గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా సాగుతోంది.!
ఆగని అక్రమాలు పట్టుకునే నాధుడే కరువు..?
జిల్లాలో సుమారు గా 380 రేషన్ దుకాణాలు, 1,80,115 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 4,99,914 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంత్యోదయ కార్డులు 14500 ఉండగా 34,673 మంది లబ్ధిదారులు, ఆహార భద్రత కార్డులు ,1,60,400 ఉండగా 4,65,020 మంది, అన్నపూర్ణ కార్డులు 225 ఉండగా 230 మంది లబ్ధిదారులు ఉన్నారు.అని సమాచారం? వీరికి ప్రతినెల సుమారు 2,80,99,850 కిలోల బియ్యం అవసరంగా అని అలాట్
చేస్తున్నారు. కొందరు లబ్ధిదారులు రేషన్ షాప్ లలో తీసుకుంటున్నారు. మరి కొంతమంది ఫింగర్ ప్రింట్ కె పరిమితం కాగా షాప్ లోని డీలర్ లకు అమ్మేస్తున్నారు. ఇందులో బియ్యం ఎక్కువ శాతం పక్కదారి అనగా నెలసరి సమీపించడంతో స్టాక్ ను దళారులకు పక్కదారి పట్టించడంలో వారు కూడా మెలకువలు నేర్చుకున్నారు అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వీరిపై చాలా విమర్శలు ఉన్నాయి. జిల్లాలో నిత్యం బియ్యం పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే ఇంటిదొంగ ఈశ్వరుడే అన్నట్టుగా పట్టుకోలేని పరిస్థితి రేషన్ షాప్ లోని బియ్యం, జేబులో డబ్బులు ఇలా జరుగుతున్నా ఈ తథాంగాన్ని పట్టుకున్న దాఖలాలు కనుమరుగు.ఈ నెలలోనే జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్స్ సిబ్బంది. జిల్లా పౌరసరఫరాల సిద్ధం కొన్ని ప్రయత్నాలు చేసి కొందరిపై కేసు నమోదు చేసిన దాఖలాలు ఉన్నప్పటికీ అక్రమ పిడిఎస్ పై ఆగాని తతంగం. ఆయా మండలాల వారీగా రేషన్ కోట డీలర్లు మాత్రమే ఈ ఘాతుకానికిపాల్పడుతున్నట్టు సమాచారం.
సమయపాలన లేకుండా షాపు లు తెరవడం..?
వాస్తవంగా పౌరసరాపరార సంబంధాల శాఖ కేటాయించిన నిర్ణీత సమయానికి బయోమెట్రిక్ విధానం అనుసంధానం అయ్యేవిధంగా చూడాలి. ఇదే అదునుగా ఏ సమయంలో అయినా షాప్ తెరవచ్చు, మూసివేయొచ్చు. ఎదేచ్ఛగా అడిగే వారే లేరని పట్టించుకునే నాధులే లేరని విచ్చలవిడిగా జోరుగా నియమ నిబంధనలు పాటించకుండా సమయపాలన లేకుండా షాప్ లు తెరవడం కొసమెరుపుగా మారింది. వీరిపై సివిల్ సప్లై వారు కన్నేసిన దాఖలాలే లేవు..?
ఫస్ట్ నుండి 15 వరకు ఒక దఫా.. 15 నుండి 30 వరకు..?
ఇలా అక్రమంగా అదనంగా లబ్ధిదారుల నుండి సేకరించిన బియ్యాన్ని స్థానికంగా ఉండే మిల్లర్లకు గాని, పౌల్ట్రీ ఫోమ్ లకు గాని అడ్డు అదుపు లేకుండా ఏదేచ్ఛగా అక్రమంగా అమ్ముతున్న వైనం ఇట్టి విషయంపై ఇన్ఫోసిమెంట్ ఏం చేస్తోంది. అని పలువురు విశ్వసిస్తున్నారు.
పోషకాల రేషన్ పక్క పరేషాన్..?
రేషన్ బియ్యాన్ని ఎక్కువ మంది లబ్ధిదారులు పిండి వంటల క్ ఉపయోగించు
కోవడం, దళారులకు అమ్ముకోవడం సాధారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో పౌరసరఫరాల శాఖ ప్రత్యేకంగా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దీనికి తోడుగా గత నెల నుంచి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని అందించనుంది. జిల్లాల్లో బలవర్ధకమైన పోషకాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ నెలలో సరఫరాలో పోషకాల బియ్యానే అందిస్తున్నారు. పేద ప్రజల్లో పోషకాహార లోపం తలెత్తకుండా బియ్యం ఉపయోగపడుతుంటాయి క్వింటాల్ సాధారణ బియ్యంలో ఒక కిలో పోషకాల తో పాటు ఫర్టి ఫైడ్ రైసును కలుపుతారు. ఐరన్, విటమిన్ బీ 12, బీ1, బీ6, జింక్, పొలిక్
యాసిడ్‌తోపాటు గోధుమలు, మినుములు, పెసర, ఆవాలు, రాగులు, సజ్జలతో కూడిన పొడిని ఇందులో ఉపయోగించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రయోగాత్మకంగా రేషన్ బియ్యంలో కూడా మార్పులు తీసుకువస్తున్నా లబ్ధిదారులు మాత్రం వీటిని దళారులకు అమ్ముతున్నారు.
లైవ్ సీసీ కెమెరాలతో కొత్త మార్పు తీసుకురావాలి.?
ప్రస్తుతం ఈ దందాపై ప్రభుత్వనిగా తప్పనిసరి. సీసీ ఫుటేజీ ఆధారంగా రేషన్ షాప్ లలో జరుగుతున్నతంగం నీటి సమయానికి షాప్ తెరుస్తున్నారు. షాప్ లో ఎవరెవరు ఉంటున్నారు.షాప్ ఏ సమయంలో మూసి వేస్తున్నారు. బియ్యం వచ్చే సమయం లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రక్రియ అంతా సజావుగా సిసి ఫుటేజ్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందే అవకాశం లేకపోలేదు. ఇకనైనా పౌరసరపార శాఖ స్పందించి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మేధావి వర్గం భావిస్తోంది.