నిషేధిత 740 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత
– జులాయి లపై డేగ కన్ను
– మత్తు పదార్థాలపై ఉక్కు పాదం
– కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి
– నిందితుడు రిమాండ్

కామారెడ్డి జిల్లా , జూలై 22 ( లోకంతీరు ) : జులాయి లపై డేగ కన్ను తో పర్యవేక్షిస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం అన్నారు.కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ కాలనీ చెందిన కుంభాల రాజేష్ యాదవ్ అనే వ్యక్తి గత కొంతకాలం నుండి నిషేధిత గంజాయిని హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి తీసుకువచ్చి కామారెడ్డి పట్టణంలో అతనికి తెలిసిన వారికి, స్నేహితులకు, ఇతరులకు అమ్ముతూ జులాయిగా తిరుగుతున్నాడు. అయితే ఇతని కదలికలపై అనుమానంతో, సరైన సమాచారంతో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కామారెడ్డి బస్టాండ్ వద్ద ఎస్ఐ రాజారాం సిబ్బంది. రాజేష్ యాదవ్ ని పట్టుకోగా, అతని వద్ద సుమారు 740 గ్రాముల ఎండు గంజాయి పట్టుకుని, పీఎస్ కి తీసుకువచ్చి విచారణ చేయగా, చేసిన నేరాన్ని అంగీకరించినట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది కేసులలో నేరస్తుడిగా ఉన్నాడు.గంజాయి స్వీకరించిన ఎక్కడ నుండి గంజాయి కొనుక్కొని వచ్చిన విషయాలు తదుపరి విచారణలో పూర్తిస్థాయిలో తెలుపుతామని అన్నారు. సోమవారం అరెస్టు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిసి జైలుకు పంపమన్నారు, మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు గాని, లేదా మన కుటుంబ సభ్యులకు గానీ గంజాయి కి సంబంధించిన ఏమైనా చెడు అలవాట్లు ఉంటే, వెంటనే వాటిని మాన్పించాల్సిందిగా, వారికి సరైన కౌన్సిలింగ్ ను ఇప్పించాల్సిందిగా, గంజాయి అమ్మిన వారి సమాచారం గానీ లేదా ఎవరైనా మనకు తెలిసిన గంజాయిని అమ్ముతున్నారని లేదా కొంటున్నారని తెలిసినా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. కామారెడ్డి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలలో, కామారెడ్డి జిల్లాలో గంజాయి ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు.