Take a fresh look at your lifestyle.

తీజ్ పండగ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు…

0 1,351

తీజ్ పండగ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ నగర్ మండలం యాచారం గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామ పంచాయతీల నిర్వహించిన తీజ్ పండగలో పాల్గొన్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు సదాశివ నగర్ బారాస మండల పార్టీ అధ్యక్షుడు బొలిపెల్లి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోగు బండార్ కార్యక్రమం తో పాటు కన్నెపిల్లలు గోధుమ మొలకలను ఎత్తుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు.గిరిజన ఆరాధ్య దేవుడైన జగదంబ మాతకు సేవాలాల్ మహారాజ్ కి రామారావు మహారాజ్ కి జై అనుకుంటా పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో , యాచారం మాజీ సర్పంచ్ లతా రమేష్ గిరిజన నాయకులు మంగ్యా నాయక్ లచ్చిరాం నాయక్ బాబ్యా నాయక్ బలరాం నాయక్ రమేష్ పంతులు తోపాటు గిరిజన తండాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.