కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి
– అర్బన్ ఎమ్మెల్యే


నిజామాబాద్, ఆగస్టు 06 ( లోకంతీరు ) : రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి & షాదిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం కింద లక్షనూటపాదహారు రూపాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం హామీని వెంటనే అమలు చేయాలనీ మా ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని కేంద్ర ప్రభుత్వం 6% కస్టమ్ డ్యూటీ తగ్గించడం కారణంగా బంగారం ధరలు కూడా తగ్గినాయి అని అన్నారు చెక్కుల జారీ విషయంలో కూడా జాప్యం జరుగుతుందని మిత్తికి తెచ్చిన డబ్బులకు సగం వడ్డీయే అయితే ప్రయోజనం ఉండదు అని అప్లై చేసుకున్న రెండు నెలల కాలవ్యవధిలో చెక్కులు విడుదల చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు అనంతరం సౌత్, నార్త్ జోన్లకు చెందిన 388 మంది లబ్దిదారులకు చెక్కులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.