Take a fresh look at your lifestyle.

యూనియన్ బ్యాంకు లో రైతులకు తప్పని తిప్పలు…?

0 1,267

యూనియన్ బ్యాంకు లో రైతులకు తప్పని తిప్పలు…?

— రుణమాఫీ అయిన డబ్బులు ఇంకా పడకపోవడంతో రైతులు ఆగ్రహం?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ యూనియన్ బ్యాంకులో రైతులకు కష్టాలు తప్పడం లేదు రుణమాఫీ అయిందని బ్యాంకుకు వెళితే రుణమాఫీ ఇంకా కాలేదని రుణమాఫీ అయిన వాళ్ళ డబ్బులు ఇంతవరకు పడడం లేదని రైతులు బ్యాంక్ అధికారుల పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అయిన డబ్బులు వెంటనే వారి ఖాతాలో జమ అవుతాయని చెప్పిన సీఎం ఉపముఖ్యమంత్రి మాటలు వ్యర్ధమే అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ లిస్ట్ రావడంతో బ్యాంక్ అధికారులను సంప్రదించగా ఇంకా మీ అకౌంట్లో డబ్బులు పడలేదని వారు సమాధానం చెప్పడం గమనార్ధం కానీ బ్యాంక్ అధికారులపై రైతుల ఆధ్వర్యంలో బ్యాంకుల చుట్టూ రైతులను తిప్పుకోవడం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అయినా గాని డబ్బులు అకౌంట్లో పడకపోవడం పట్ల రైతులు నిరాశ చెంది వేణు తిరిగి వెళ్ళిపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.