సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలి
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 31 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కేంద్రంలో జమ మస్జిద్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరగలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించిహెడ్ కానిస్టేబుల్ జయవంతరావు మాట్లాడుతూ యువకులు మత్తు పదార్థాలతో దూరంగా ఉండాలని సెల్ ఫోన్లో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ మాయ మాటలు చెప్పి మీ ఖాతాల నుండి డబ్బులు మాయం చేస్తున్నారని ఇటువంటి రాంగ్ కాల్స్ వస్తే ఎవరు కూడా లిఫ్ట్ చేయవద్దని అన్నారు, సీబీఐ నంబర్ అని ఎక్కువ శాతం ఫోన్లు వస్తున్నాయని అటువంటి నెంబర్లను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు, పై చదువుల కోసం విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని టార్గెట్ చేస్తూ వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీ కొడుకు గంజాయి లో పట్టుబడ్డడని బెదిరించి డబ్బులను వసూలు చేస్తున్నారని అటువంటి ఫోన్లో వచ్చిన వెంటనే అప్రమత్తంగా ఉండాలన్నారు, గ్రామంలో ఎవరైనా అమాయకంగా తిరిగే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు, ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు సదానంద్, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.