విద్యారంగం గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..?
— పెండింగ్లో 8 వేల కోట్లు
— స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.!
— జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 31(లోకంతీరు) : విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఎం జబ్బర్ నాయక్ అన్నారు.సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇలా తక్కువ కెటయించడం
దుర్మార్గమన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారని అర్థమవుతుందన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక పోవడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. విద్యారంగాని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం 7.30 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,గురుకులలు, కళాశాల నుంచి యూనివర్సిటీ దాకా సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. గురుకులలు కిరాయి భవనాలలో నడిపిస్తూ విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పడం సరికాదన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.