Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేయడంలో విఫలం….

0 1,261

ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేయడంలో విఫలం

కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 ( లోకంతీరు) : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటిలో ఎక్కువ మొత్తం గ్యాస్, విద్యుత్ అని బీబీపేట మాజీ ఎంపిటిసి నీరజ నర్సింలు అన్నారు. బిబిపేట్ మండలం లో చాలామంది సర్వర్ రాలేదనుకుంటూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు, ఆగ్రహం వ్యక్తం చేసారు. బిబిపేట మండల కేంద్రంలోని పదివేల ఉన్న జనాభాలో కనీసం 60 శాతం మంది కూడా గ్యాస్ కానీ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఈ విద్యుత్ పథకం కూడా ప్రతి లబ్ధిదారికి ఇప్పటికే ఊసే లేదన్నారు. 200 లోపల ఉన్నా యూనిట్లు తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో ఫిర్యాదు చేసి ఉన్న సభ్యులు కూడా 65% మందికి అయిన ఇంకా దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని హామీలు ఇస్తున్నామని చెప్పుతున్నారు. ఇలా కొంతమందికి ఇచ్చి కొంత మందికి ప్రజా పాలన వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకోండని ఎంపీడీవో వివరించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి విద్యుత్ బిల్లు కట్టవలసిన అవసరం లేదు. విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్లేమో కచ్చితంగా కట్టాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి లబ్ది దారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. ఉన్నవారికి ఇప్పటికే ఎనిమిది నెలల ఉచితం గా అందుతుంది. విద్యుత్ బిల్లు నిజంగా మీరు మాట తప్పకుండా ప్రభుత్వం ఈ రెండిటి మీద వెంటనే వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దు కోవాలన్నారు. ప్రజా పాలన అర్హులకు అందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బిల్లులు కట్టకపోతే బలవంతంగా కట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మరోసారి ప్రజా పాలన పెట్టి దరఖాస్తుల స్వీకరించి అందరికీ విద్యుత్ బిల్లు ఉచితం అయ్యే విధంగా సహకరించాలని కోరారు. ఎవరైతే విద్యుత్ బిల్లు కట్టలేరు. ఇప్పటి వరకు వాళ్ళు విద్యుత్ బిల్లు కడతాను లేరు కాబట్టి మీరు వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అప్పటినుంచి ఇప్పటివరకు జీరో బిల్లు లేని నిరుపేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.