వరి రైతులను వెంటాడుతున్న మొగి పురుగు..!
-వేలల ఎకరాల్లో పంటలకు నష్టం
-ఎన్ని మందులు పిచికారీ చేసిన కానరాని ఫలితం
-క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా అధికారులు ఫలితం లేదంటున్న రైతులు
-ఉద్రిక్తంగా వ్యాపిస్తున్న మొగ్గి
-ఆందోళన చెందుతున్న అన్నదాతలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 13 ( లోకంతీరు ) : ఆరుగాలం కష్టించిన అన్నదాతకు కన్నీరే మిగిలిరేలా ఉంది. వాతావరణ దృశ్య క్రిమి కీటకాల వలన వరి పైరుకు ముగి పురుగు భారంగా మారింది. వరి పంటలో ప్రధానంగా వచ్చే ముగిపురుగును నివారించడం చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. దీనికోసం రకరకాల మందులను పిచికారి చేస్తున్నా అన్నదాతలు
యాసంగి వరిలో మొగి పురుగు ఉధృతంగా…!
వ్యాపిస్తున్నది. ముఖ్యంగా డిసెంబర్లో నాట్లు వేసిన పొలాలపై ప్రభావం చూపుతున్నది మరో పక్క జింక్ లోపం, సల్ఫైడ్ దుష్ప్రభావం కూడా కనిపిస్తున్నది. ఫలితంగా పొలాలను వదిలేసే పరిస్థితి వస్తున్నది. గత యాసంగి, వానకాలం సీజన్లలోనూ ఇలానే ప్రభావం పడి దిగుబడులు తగ్గగా.. ఈ సారి అలాంటి పరిస్థితే కనిపిస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్నదాతలను అప్రమత్తం చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.ఫిబ్రవరి మొదటి వారం వరకు వరి నాట్లు వేశారు.ప్రస్తుతం చాలా చోట్లకు వరికి మొగి పురుగు సోకుతుండడంతో రైతులకు కలవరపెడుతోంది.మండలంలోని అడవిలింగల్, హజీపూర్ తండా, తిమ్మాపూర్, గండిమాసానిపేట్, లాక్ష్మపూర్, తిమ్మారెడ్డి, అన్నసాగర్, వెల్లుట్ల, రుద్రారం, జంగమైయిపల్లి తదితర గ్రామాలలో మొగి పురుగు బెడద తీవ్రంగా ఉందని పలువురు రైతులు చెబుతున్నారు.
నివారణ చర్యలు…
ప్రస్తుతం చాలాచోట్ల వరి పొలాలు పిచికారీ చేశారు.మరికొన్ని పిచికారీ దశలో ఉన్నాయి. ఈ సమయంలో మొగి పురుగు ఉధృతిని నివారించేందుకు . ఈ దశలో ఎకరాకు కార్బోప్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు, లేదంటే క్లోరాన్ట్రోనిలిప్రోలు 4జీ గుళికలు 4 కిలోలు 20 నుంచి 25 కిలోల ఇసుకలో కలిపి బురద పదనులో వేసుకోవాలి.
మొగి పురుగు నివారణకు సిఫారసు చేయబడని ఏ ఇతర 10జీ లేదా సేంద్రియ గుళికలు (గంట గోళీలు) యూరియాతో కలిపి వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రైతులు గమనించాలని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ వరి పంట చిరుపొట్ట దశలో రెక్కల పురుగు ఉధృతిని గమనిస్తే కార్టాప్ హైడ్రోక్లోరైడ్, 50 శాతం ఎస్పీ 2 గ్రాములు, (ఎకరాకు 400 మిల్లీ లీటర్లు ) లేదంటే క్లోరాన్ట్రోనిలిప్రోలు 0.3 మిల్లీ గ్రాములు (ఎకరాకు 60 మిల్లీ లీటర్లు) లేదంటే ఐసోసైక్లోసిరం 0.6 మిల్లీ లీటర్లు (ఎకరాకు 120 మిల్లీ లీటర్లు) ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
జింక్ లోపం ఉంటే….
జింకు ధాతులోపంతో పొలాలు పాలిపోతున్నట్టు గుర్తించిన అధికారులు, నివారణ చర్యలను వివరిస్తున్నారు. ప్రతి యాసంగి సీజన్లో రైతులు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింక్ సల్ఫేట్ను 200-250 కిలోల మాగిన పశువుల పేడ లేదంటే వర్మీ కంపోస్టు కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గిన తర్వాత చివరి దుక్కిలో వేయాలని చెబుతున్నారు. పైరుపై జింక్ లోపం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ను కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలని, జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగులు, తెగుళ్ల నివారణ మందులు కలుపవద్దని, చౌడు నేలల్లో పిచికారీ తప్పని సరిగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
వాతావరణంలో మార్పులతోనే…
ప్రస్తుతం వాతావరణంలోని చలి మామూలుగానే ఉన్నప్పటికీ మొగి పురుగు బెడద వచ్చినట్లు పలువురు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.ఈ పురుగు కాండన్నీ తొలచడంతో పంట ఎదుగుదల లేకుండా అవకాశం ఉంటుంది. సాధారణంగా వరి గొలుసు కట్టే సమయంలో మొగి పరుగు సోకడాన్ని చాలా సీజన్లో చూసిన ఇప్పుడు నారికి ఇది ఆశించడం జిల్లాలో మొదటిసారి అని పలువురు రైతులు చెబుతున్నారు.
నారు వేసిన పక్షం నుంచే…
యాసంగి నాట్లు మొదలై నెల రోజులు దాటింది. నాట్లు వేసిన 15 రోజులకే మోగి పురుగు పంటను ఆశిస్తుంది తెగులు చాయలు కనబడగానే రైతులు అప్రమత్తమవుతున్నారు. రసాయన పురుగుమందులు పిచకారీ చేస్తున్నారు. ఎకరాకు రూ.2000 నుంచి రూ.4000 వరకు ఖర్చు చేస్తున్నారు అయినా తెగులు మోగి నియంత్రణలోకి రావడంలేదని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏ మందు చెబితే అది పిచికారీ….
జిల్లాలోని అన్ని మండలాల్లో మొగి పురుగు బెడద ఉంది. కొన్ని మండలాలలో వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించడం లేదని సమాచారం. రైతులకు సూచనలు ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రైతులు రసాయన మందుల దుకాణాలకు వెళ్లి వారు ఏది చెబితే అదే కొని తెచ్చి పిచికారీ చేస్తున్నారు. కొన్ని కొన్ని ఫెర్టిలైజర్ షాపులలో పంటల రోగాలపై అవగాహన లేని మందులు ఇస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పురుగుమందుల దుకాణాల యజమానులకే లబ్ధి కలుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. మొగి ఉద్రిక్తం మాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు.