మండల కేంద్రంలో రైతుల పంటలను పరిశీలన

కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంటల్లో చీడపురుగులు ఎక్కువగా ఆశించడం అయినది. ముఖ్యంగా వరిలో ఖాండం తొలిచే పురుగుని గమనించారు. దీని నివారణకు వరి పిలక దశలో ఉన్నట్లయితే 4జి గుళికలను 8 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. క్లోరైట్రినోప్రోలు 4జీ గుళికలను 4 కేజీలు ఎకరాకు వేసుకోవాలి. అలాగే ప్రతి చెనుల్లో చూసినట్లయితే రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నది. దీనిని వారణకై ఫిఫ్త్రోనిల్ 2 ఎం ఎల్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి లేదా సెల్ఫోన్సో ఫ్లోర్ 1 ఎమ్ ఎల్ పర్లీటర్నిటీ కలిపి పిచికారి చేసుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో భిక్నుర్ వ్యవసాయ అధికారి రాధా రెడ్డి, వ్యవసాయ అధికారి వినోద్, రైతులు పాల్గొన్నారు.