జాతీయ కమిటీ లో కామారెడ్డి వాసికి చోటు

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (లోకంతీరు): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య విద్యార్థి సంఘం యొక్క జాతీయ జనరల్ బాడీ సమావేశాలు ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో ఓంకార్ భవన్ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశాలకు 12 రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. జనరల్ బాడీ సమావేశంలో జాతీయ కమిటీ లో కామారెడ్డికి చెందిన మాలవత్ జబ్బర్ నాయక్ ను కేంద్ర కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే నాపై నమ్మకంతో కేంద్ర కమిటీలో తీసుకున్నటువంటి జాతీయ కన్వీనర్ మైత్రి రాజశేఖర్ కి అలాగే పార్టీ జాతీయ కార్యదర్శి మద్దికేర అశోక్ ఓంకార్ కి కృతజ్ఞత లు తెలిపారు నాపై నమ్మకంతో బాధ్యత ఇచ్చిన అ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థి సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.