Take a fresh look at your lifestyle.

శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం మొదటి అంతస్తు ప్రారంభోత్సవం…

0 1,327

శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం మొదటి అంతస్తు ప్రారంభోత్సవం

• ముఖ్య అతిథిగా  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

• సంఘం యొక్క మొదటి అంతస్తు ప్రారంభోత్సవం 

• నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం 

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం/  చంద్రశేఖర్ కాలనీ, ఆగస్టు 17 ( లోకంతీరు ) :  చంద్రశేఖర్ కాలనీ నందు గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం యొక్క భవనం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా అధ్యక్షులు శ్రీ చింత కొండలగుప్త, ప్రధాన కార్యదర్శి పాత శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి కాటిపల్లి ప్రేమ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, నిజామాబాద్ పట్టణ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొండవీరశెఖర్ గుప్తా అదేవిధంగా ప్రధాన జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి అర్వపల్లి పురుషోత్తం గుప్తా , జిల్లా వాసవి సేవాదళ్ చైర్మన్ మహంకాళి విజయ్ కుమార్ గుప్తా అదేవిధంగా ఎన్నికల నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులు పెద్ది జగదీశ్వర్ గుప్తా, చిదుర మాణిక్యం గుప్తా వీరితోపాటు ఎన్నికల కన్వీనర్ ఎర్రం వినోద్ కుమార్ గుప్తాలు పాల్గొనడం జరిగింది. సంఘం యొక్క భవనం మొదటి అంతస్తు కార్యక్రమం పూర్తయిన వెంటనే సంఘంలో జరిగిన నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిపించడం జరిగింది. ఈ యొక్క నూతన కార్యవర్గంలో సర్వ ప్రవీణ్ కుమార్ గుప్తా అధ్యక్షులుగా, కాటిపల్లి ప్రవీణ్ కుమార్ గుప్తా ప్రధాన కార్యదర్శిగా, మరియు శశిధర్ గుప్తా కోశాధికారిగా, అదేవిధంగా ఉపాధ్యక్షులను, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధ్యక్షులు సర్వ ప్రవీణ్ గుప్తా తమ వంతు సహాయాన్ని, సమయాన్ని సంఘానికి కేటాయించి సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడుతానని హామీ ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.