నూతన మండల వ్యవసాయ అధికారినిగా లావణ్య

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 17 ( లోకంతీరు ) : బాల్కొండ మండల వ్యవసాయ అధికారినిగా బద్దం లావణ్య బాధ్యతలు స్వీకరించడం జరిగినది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ అధికారుల బదిలీల్లో లావణ్య మోర్తాడు మండలం నుండి బాల్కొండ మండలానికి కేటాయించడం జరిగినది. బాల్కొండ మండల వ్యవసాయ అధికారిగా ఇదివరకు పనిచేసిన మహేందర్ రెడ్డి , నిజాంబాద్ అర్బన్ వ్యవసాయ అధికారిగా బదిలీ కావడం జరిగినది.నూతన వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ వ్యవసాయ సలహాలు సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.