ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
– రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత
– జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : -ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతఅన్నారు. కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం, సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని స్తుతిస్తూ ప్రార్థన చేసిన పిదప, ఆర్యవైశ్య సంఘం మహాసభ జిల్లా అధ్యక్షునిగా కంచర్ల బాలకిషన్ గుప్త, ప్రధాన కార్యదర్శిగా ముత్యపు సుదర్శన్ గుప్త, కోశాధికారి మోటూరి రాజులు గుప్త చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆతర్వాత అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శిగా ఎంసాని సుధాకర్ గుప్త, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉప్పల హరిధర్ గుప్త, ఆడిషనల్ కోశాధికారి నంగునూరి శ్రీనివాస్ గుప్త, పీ ఆర్ ఓ గా కొండ శైలెందర్ గుప్తల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కల్వ సునీత మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్య వైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పరిణామం అని అన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా మహిళగా తనకు మొదటి అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆర్యవైశ్యులు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని రాజకీయంగా కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఆతర్వాత ఉపాధ్యక్షులు, యువజన విభాగం, రాజకీయ విభాగం, వాసవి సేవాదళ్, వాణిజ్య విభాగం, మహిళా విభాగం, మహిళా విభాగం సలహాదారులు, కార్యదర్శులు, ఇ సి మెంబర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సునీత, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ రావు గుప్త, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు కంచర్ల లింగం గుప్త, మాజీ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పాత బాలకృష్ణ, వంగపల్లి నాగభూషణం, చంద్రపాల్ గుప్త, నార్ల రత్న కుమార్ గుప్త తో పాటు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు కంచర్ల శ్రీనివాస్ గుప్త, కంచర్ల శ్రీధర్ గుప్త, ఆర్యవైశ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.