Take a fresh look at your lifestyle.

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…

0 1,371

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

– ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చేందిన నర్సయ్య కుమారుడు నవదీప్ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీకి విషయం తెలపడంతో వారు వెంటనే స్పందించి నిమ్స్ ఆసుపత్రి డాక్టర్ తో మాట్లాడి నవదీప్ కు ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 75000/- రూపాయల ఎల్.ఓ.సి ని శనివారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి నవదీప్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.