Take a fresh look at your lifestyle.

మూడవ కల్లు డిపో పై… ఆరోపణలు అవాస్తవం

0 1,223

మూడవ కల్లు డిపో పై… ఆరోపణలు అవాస్తవం

– భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్

నిజామాబాద్ ,ఆగస్టు 22(లోకంతీరు) :  నిజామాబాద్ నగరంలో గల మూడవ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం పై పలువురు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం భవానీ గీత కార్మిక సంఘం కెసిఅర్ కాలనీలోని కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి వి ఎల్ ఎన్ గౌడ్, డైరెక్టర్లు శ్యామ్, రాజగౌడ్, ట్యాపర్ సాయ గౌడ్ లు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మా మూడవ కల్లు డిపో పై కొందరు అసత్య ప్రచారం చేస్తూ మా సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మా మూడవ డిపోలో 63 మంది ట్యాపట్లు, 400 పైన సభ్యులు ఉన్నారని వీరందరికీ ట్యాపర్లకు సంవత్సరానికి లక్ష చొప్పున, నాన్

ట్యాపర్లకు సంవత్సరానికి 18 వేలు మాముల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. మా సంఘం బలోపేతంగా ఉందని లేనిపోని ఆరోపణలు చేస్తూ మా సంఘాన్ని మా సంఘ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మా సంఘంలో ఎలాంటి సభ్యత్వం లేనటువంటి వ్యక్తులు బురదజల్లే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మా సంఘాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో మాకు తెలుసని బయట వారి ద్వారా చెప్పించుకునే స్థితిలో మేము లేమన్నారు. కొందరు వ్యక్తులను కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మా సంఘంలో ఏ సభ్యునికైనా సమస్య ఎదురైతే సంఘం దృష్టికి తీసుకురావాలన్నది మా బైలాస్ లో రాసుకున్నామని, బైలా ప్రకారమే సంఘాన్ని కొనసాగిస్తూ, గత ఎనిమిదేళ్లుగా సంఘాన్ని బలోపేతం చేస్తూ, నిజామాబాద్ లో స్థిర పడ్డ వారికి కొత్త వారిని కూడా సభ్యత్వం ఇస్తూన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిపో డైరెక్టర్లు శ్యాంసుందర్ గౌడ్, తిరుమలేష్ గౌడ్ , లాలా గౌడ్ , లక్ష్మణ్ గౌడ్, రాజ గౌడ్, సుభాష్ గౌడ్, ట్యాపర్లు సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.