అపెక్స్ హాస్పిటల్ పై వస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూన్నం
–హాస్పిటల్ యాజమాన్యం
కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోని అపెక్స్ హాస్పిటల్ పై వస్తున్న వదంతులకు వారి యాజమాన్యం స్పందించి పత్రిక ముఖంగా వివరణ ఇవ్వడం జరిగింది.
22/09/2024సాయంత్రం 6 గంటల సమయంలో ఎం శ్రీనివాస్ (34) అతని మిత్రులు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించి బండి పై నుండి పడి మా హాస్పిటల్ కు తీవ్ర రక్తస్రావంతో వచ్చారు. వారికి హుటా హుటిన మేము డ్యూటీ డాక్టర్ తో వైద్య సదుపాయం కల్పించి అతని గాయాలను శుభ్రపరిచి ఫస్ట్ యాడ్ చేసి బ్యాండేజ్ వేయడం జరిగింది. కుట్లు వేసుకోవడానికి పేషెంట్ సహకరించకుండా డాక్టర్ నార్సింగ్ స్టాఫ్ ను నాన బూతులు తిడుతూ అసభ్య పదజాలం వాడుతూ హాస్పిటల్ నుండి బయటకు వెళ్లి మరొక హాస్పిటల్ వెళ్లి కూడా అలాగే అసభ్యంగా ప్రవర్తించడం వల్ల సిబ్బంది కూడా బయటకు పంపించారు. వాళ్లు మా హాస్పిటల్ పైకి ముక్కముడిగా వచ్చి డోర్స్ క్లోజ్ చేసి కూర్చునే కుర్చీలను ఎత్తివేస్తూ హాస్పిటల్ సిబ్బందిపై అసభ్యంగా తిడుతూ దాడి చేసారు. ఇట్టి సమస్యపై ఎం శ్రీనివాస్, పేషెంట్ కు ఎలాంటి కుట్లు వేయను లేదు తీయను లేదు డబ్బులకు కూడా ఇబ్బంది పెట్టలేదు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారి పైన వారి మిత్రుల పైన కఠిన తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను కోరడం జరిగింది. ఇలాంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న అని యాజమాన్యం పత్రిక ముఖంగా తెలిపారు.