Take a fresh look at your lifestyle.

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్….

0 1,203

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 22 ( లోకంతీరు) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పంట రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి గత మూడు దఫాలలో రెండు లక్షల రూపాయల లోపల పంట రుణాలు కలిగి ఉన్న కుటుంబాలకు రుణమాఫీ చేపట్టడం జరిగిందని బాల్కొండ తహసిల్దార్ అడప శ్రీధర్ తెలిపారు. గురువారం రోజున రెవెన్యూ, వ్యవసాయ శాఖ మరియు పోలీసు శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో జలాల్పూర్ లో రైతు రుణమాఫీకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రెండు లక్షల లోపు పంట రుణాలు కలిగి ఇంకా రుణ మాఫీ కాని రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ వివిధ సాంకేతిక కారణాలవల్ల రెండు లక్షల రూపాయల లోపల పంట రుణాలు కలిగిన కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని అటువంటి వారి కోసం మండల కేంద్రంలో కూడా ఒక రుణమాఫీ ఫిర్యాదుల నమోదు కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. భార్యా భర్తలు మరియు వారి మైనర్ సంతానమును కలిపి ఒక కుటుంబంగా పరిగణిస్తారు. కావున రెండు లక్షల రూపాయల లోపు లోన్ కలిగిన రైతు కుటుంబాలకు ఎవరికైనా రుణమాఫీ జరగనట్లయితే రుణమాఫీ ఫిర్యాదుల కేంద్రంలో అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని ఈ సందర్భంగా రైతులను కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో బాల్కొండ ఎస్సై బీ నరేష్,ఎం ఆర్ ఓ శ్రీధర్,మండల వ్యసాయ అధికారిని లావణ్య,వ్యవసాయ విస్తరణ అధికారిని రేష్మ, మరియు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.