వ్యవసాయ శాఖ సలహాదారులు కలిసిన మాజీ సర్పంచ్

కామారెడ్డి జిల్లా రామరెడ్డి, ఆగస్టు 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రామరెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మర్యాపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రైతుల రుణమాఫీ, రైతు పండించిన పంటలకు భీమా గురించి చర్చించారు. వెంటనే స్పందించి సి ఎం, వ్యవసాయ మంత్రితో చర్చించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.